ఇప్పటి వరకు నువ్వు గాలిలో మేడలు కట్టి ఉంటే , విచారించవలసిన పని లేదులే , వాటిని అలాగే ఉండనివ్వు . కానీ.................................... ఇప్పటికైనా వాటి క్రింద పునాదులను నిర్మించడం మొదలు పెట్టు . Gud mrng:-...
తెలిసో తెలియకో.. చిన్న తప్పు చేయండి.... ఎత్తి చూపించడానికి వంద మంది సిద్ధంగా ఉంటారు.. అదే వంద మందీ మనం చేసే ఒక్క మంచి పనికి భుజం తట్టడానికి మాత్రం దరిదాపుల్లో కూడా కన్పించరు.. అందరూ మంచీ చెడూ అన్నీ చూస్తూనే ఉంటారు... కానీ చెడు కన్పించగానే వాలిపోతారు.....
ఓ మంచి సంకల్పాన్ని వివాదాస్పదం చేయాలనుకునే ముందు ఆ సంకల్పం వెనుక లిఖించబడిన చరిత్రను కూడా విశ్లేషించ౦డి. "పిట్ట కొంచెం కూత ఘనం" అనే నానుడి పక్షులకు సరిపోతుందేమో గానీ మనుషులకు కాదు. విషయ పరిజ్ఞానం లేని వారు వివాదాలకు దూరంగా వుండడమే శ్రేయోస్కరం...