జనం జెండా ..సొగెరా!!
--------------------------
కొందరు జనం కోసం
జన్మిస్తారు..
మరి కొందరు జనంలో
కలిసి పోతారు ..
దారులు వేరు ..వాదాలు వేరు
అభిప్రాయాలు ..ఆలోచనలు వేర్వేరు
అయినా అందరి రహదారి ఒక్కటే
అదే జనం రాస్తా ..ప్రజల చౌరస్తా ..!!
పోరాటం ఊపిరిగా
ఉద్యమమే నినాదంగా
ముందుకు పోవటం అంటే
బతుకును తాకట్టు పెట్టటమే
లోకమే నాటకమై ఊరేగుతున్న
ఈ తరుణంలో ..అణగారిన జాతి నుంచి
నిటారుగా నిలబడటం అంటే
మరో యుద్ధాన్ని చేయటమే
బహుశా అన్ని దారుల్లో కెల్లా
ప్రజల కోసం ..జనం విముక్తి కోసం
సమస్యలపై ఎక్కుపెట్టిన బాణంలా
కదలటం అంటే ..మళ్ళీ జన్మ ఎత్తినట్టే ..!!
జనమే ఊపిరిగా
కదలటం అంటే
కోల్పోయిన కాలాన్ని
చేతుల్లోకి తీసుకోవటమే
అయినా ..అందరిని ..అన్నిటిని
ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటం
స్ఫూర్తి దాయకం ..ఆచరణీయం ..!!
కులం ఊరేగుతున్న కాలమిది
మతం ముసుగులో దారుణాలు
జరుగుతున్న సందర్భం ఇది
సామాజిక వివక్ష బేషరతుగా
ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో
మాటై ..ఆయుధమై ..స్వేచ్చా గీతమై
ఆర్ధిక అసమానతలు లేని
సమాజం కోసం పరితపిస్తోంది
ఆ దిశగా పోరాటం చేస్తోంది
మీ కల ఫలిస్తుంది ..సిద్దిస్తుంది ..!!
No comments:
Post a Comment