Monday, 2 December 2013

TELUGU AMMAYE WORLD HELLO DAY


నమస్తే....................
ఈ రోజు నాకు ఇంతవరకు పరిచయంలేని ఒక పదిమందిని పలకరించాలి అనుకుని ఈ facebook ద్వారా పలకరిస్తున్నా.ఎందుకంటారా?
ఈ రోజు "ప్రపంచ పలకరింపు దినోత్సవం"(WORLD HELLO DAY).
మనుషులని నాగరికుల్ని చేసింది మాటే!కానీ మాటలతో వచ్చిన ఘర్షణలే యుద్ధాలకూ దారితీస్తాయ్.ఇది నాగరికత లేమికి సంకేతం.కానీ ఇవే మాటలతో విభేదాలు తొలగించి, శాంతినీ నెలకొల్పవచ్చు.ఈబాటలో నడవడం ద్వారా ప్రపంచ శాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతోనే 1973 సంవత్సరం నుండి ఈ రోజుని ప్రారంభించారు.కనీసం పదిమంది అపరిచితుల్ని పలకరించేలా ప్రేరేపించడమే ఈ రోజు లక్ష్యం.
దీనికి పునాది 1973 అక్టోబర్, ఇజ్రాయిల్-అరబ్ దేశాల యుద్దమే.హింసకన్నా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చనీ, మాటల వల్లే దేశాల మధ్య అవగాహన ఏర్పడుతుందనీ నమ్మిన ఇద్దరు అమెరికన్ సోదరుల(మైఖేల్ మెక్ కార్మక్,బ్రియాన్ మెక్ కార్మక్)ఆలోచనల్లోంచి పుట్టింది ఈ రోజు.విభేదాలు ఉన్నా,స్నేహంగా మెలగడం సాధ్యమే అనీ,వ్యక్తిగత స్థాయిలో జరిగే సంభాషణే ప్రపంచ శాంతికి సహకారి కాగలదని భావించి ఈ రోజుని ప్రారంభించారు.

No comments:

Post a Comment