తెలిసో తెలియకో.. చిన్న తప్పు చేయండి.... ఎత్తి చూపించడానికి వంద మంది సిద్ధంగా ఉంటారు.. అదే వంద మందీ మనం చేసే ఒక్క మంచి పనికి భుజం తట్టడానికి మాత్రం దరిదాపుల్లో కూడా కన్పించరు.. అందరూ మంచీ చెడూ అన్నీ చూస్తూనే ఉంటారు... కానీ చెడు కన్పించగానే వాలిపోతారు.. మంచి కన్పిస్తే మాత్రం చూడనట్లే మాయమైపోతారు. తప్పుల్ని గెద్దల్లా చూసి.. వేగంగా.. వాలిపోయి... చీల్చి చెండాడే చూపులు... ఒప్పుల విషయంలో మాత్రం చూసీ చూడనట్లు మూతబడేస్తాయి.. ఎవరో చేసే పనుల్లో తప్పులు ఎంచడం గొప్ప కాదు.. ఏదో ఒక పనికొచ్చే పని చేయడం గొప్ప!! ------------ గమనిక: ఇది జనరల్‌గా రాసిన విషయం! దయచేసి.. "శ్రీధర్ గారు ఎందుకు రాశారో" అని ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తూ ఈ మేటర్‌లోని ఫీల్‌ని పోగొట్టుకుని చదవకండి.
No comments:
Post a Comment